ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కులం–మతం ఆధారిత రాజకీయాలతో ఎవ్వరూ గెలవలేరని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని కూడా ఈటల తెలిపారు.
ఇతర పార్టీల్లో ఉన్న హిందువులు బీజేపీలోకి రావాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలు విభిన్నంగా మాట్లాడటం వల్ల బీజేపీ క్యాడర్‌లో అయోమయం నెలకొన్నట్టు తెలుస్తోంది.

