Home Page SliderTelangana

లయోలా అకాడమీ అల్వాల్‌లో ఈటల రాజేందర్

లయోలా అకాడమీ, అల్వాల్‌లో జాతీయజెండా ఆవిష్కరణ చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ..“స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాలలో ఎక్కువ కాలం పోరాటం చేసిన చరిత్ర భారతదేశానికే ఉంది. వందల సంవత్సరాల పాటు స్వాతంత్ర్యం కోసం భారతీయులు పోరాటం చేశారు. వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ భారతదేశంలో మనం ఈనాడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నాము. పేదరికం, అంతరాలు లేని, ఆకలికేకలు, ఆత్మహత్యలు లేని సమసమాజం స్థాపన విద్యార్థుల చేతుల్లో ఉంది.  మీరు ఈ దేశ సంపద. మీ ఎదుగుదలలోనే దేశం వికసిస్తుంది. సెల్ ఫోన్‌ను మంచికోసం మాత్రమే వాడండి అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ యువతే దేశ భవిష్యత్తు అని చెప్తూంటారు. విద్యార్థులు సాధారణంగా ఇంజనీర్లు, డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నారు కానీ, గొప్ప రాజకీయ నాయకులు కావాలని ఎవరు కోరుకోవడం లేదు. సోషల్ సైంటిస్ట్ అంటే రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సమాజమే కొలాప్స్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నేను మీ ఎంపీ ని అని గర్వపడేలా పని చేస్తాను. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మీకు అందుబాటులో ఉంటాను” అని ఈటల రాజేందర్ అన్నారు.