రైతులను వేధిస్తే ఎస్మా ప్రయోగించక తప్పదు-సీఎం రేవంత్
రైతులను వేధించే వ్యాపారస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వ్యాపారస్థులు …రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలు వెలువడటంతో ఆయన ఈ ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోళ్ళను సజావుగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వ్యాపారస్థులు గనుక ఇబ్బంది పెడితే తక్షణమే ఎస్మా ప్రయోగించాలని సూచించారు.

