జగన్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం.. సుపరిపాలన: మంత్రి మేరుగ
ఏపీలో జగన్ పాలనకి నేటితో 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కాార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఏపీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ, ఇచ్చిన మ్యానిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. చంద్రబాబు మ్యానిఫెస్టోని అమలు చేయలేక చివరికి దాన్ని కనపడకుండా చేశారని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నా అడ్డుకుంటున్నారని, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ మోసం చేసిన మనిషి చంద్రబాబని మంత్రి మేరుగ ధ్వజమెత్తారు.

