EPF అధిక పింఛను దరఖాస్తుదారుల్లో ఆందోళన
అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్‌ఓ తీసుకుంటున్న నిర్ణయాలు చందాదారులు, విశ్రాంత ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)కు బకాయిలు చెల్లించాలా? వద్దా? నిర్ణయించుకోలేకపోతున్నారు. బకాయిలు నోటీసులు జారీచేస్తున్న ఈపీఎఫ్ఓ.. పింఛను లెక్కింపు ఫార్ములా, ప్రతినెలా ఎంత మొత్తం పింఛను వస్తుందో స్పష్టత ఇవ్వకపోవడంతో పథకంలో చేరేందుకు సగానికి పైగా చందాదారులు ఆసక్తి చూపడం లేదు.

