‘దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ’..సీఎం
దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల మోసం, వివాదం చెయ్యొద్దు. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ ఉంటుంది. వికారాబాద్ జిల్లా దామగుండంలో విఎల్ఎఫ్ రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్,ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందింది. కొందరు వీఎల్ఎఫ్ ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీఎల్ఎఫ్ తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. 2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్‌నాథ్ సింగ్ అడగగానే మేం కొనసాగించాం. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించాను. ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కోరుతున్నాను. అని పేర్కొన్నారు.

