కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే విమానంలోకి ఎంట్రీ
కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం విమానయాన సంస్థల్ని అలర్ట్ చేసింది. విదేశాల నుంచి ప్రయాణికులకు కోవిడ్ నెగిటివ్ రిపోర్టులను తప్పనిసరి చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవియా వెల్లడించారు. వచ్చేవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో బీఎఫ్:7 కొత్త వేరియంట్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నందున కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ముందుగా తమ కొవిడ్ నెగిటివ్ రిపోర్టును ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్లైట్ ల్యాండైన తర్వాత ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని మాండవియా పేర్కొన్నారు.