Home Page SliderNational

ఇక చాలు నోరుమూస్కో… ఆ హీరోయిన్‌కు బీజేపీ ఆదేశం

కొన్నిసార్లు పెద్దలను ప్రసన్నం చేసుకోవడం కోసం శృతి మించి మాట్లాడటం నాయకులకు అలవాటైన పనే. కాకుంటే కొందరు హద్దు మీరతారు. కొందరు పరిధి మించి మాట్లాడే సాహసం చేయరు. రైతు నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి, ఎంపీ కంగనా రనౌత్‌ను బీజేపీ నాయకత్వం గట్టిగా మందలించింది. హద్దుల్లో ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చింది. కంగనా రనౌత్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోకుంటే, రైతుల నిరసనలు… భారతదేశంలో బంగ్లాదేశ్ లాంటి సంక్షోభానికి కారణమయ్యేవంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. “కంగనా రనౌత్‌కు పార్టీ విధానపరమైన విషయాలపై మాట్లాడే అధికారం లేదు. ఆమెకు ఆ అనుమతి లేదు. భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయొద్దని కంగనాను ఆదేశించింది” అని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతకుముందు, హర్యానా, పంజాబ్‌లోని బీజేపీ నాయకులు హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన ఎంపీకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవుపలికింది. . ‘రైతులపై మాట్లాడటం కంగనా శాఖ కాదు, కంగనా వ్యక్తిగతం.. ప్రధాని మోదీ, బీజేపీ రైతు అనుకూలమైనవి. ప్రతిపక్షాలు మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కంగనా ప్రకటన కూడా అదే చేస్తోంది. ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు.” అని పంజాబ్ బీజేపీ నాయకుడు హర్జిత్ గ్రేవాల్ అన్నారు.

ఆమె వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలన్న ఆయన, “ఇవి కేవలం కంగనా మాటలేనా లేక మరెవరో వ్యాఖ్యలనో ఆమె కాపీ కొట్టారా? లేకుంటే ఈ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది?” అంటూ ఆయన ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పేరుగాంచిన కంగనా, ఇప్పుడు రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనను తీవ్రంగా విమర్శించారు. 2020లో, ఆమె పంజాబ్‌కు చెందిన నిరసనలలో పాల్గొన్న ఒక మహిళా రైతును తప్పుగా వ్యాఖ్యానించింది. ఆమెను బిల్కిస్ బానో అంటూ కామెంట్ చేసింది. అంతకుముందు ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేక నిరసనల్లో వంద రూపాయలిస్తే మహిళలు అందుబాటులో ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీకి వెళుతున్న సమయంలో చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్‌తో కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టడంతో మొత్తం వ్యవహారం దేశ వ్యాప్త చర్చకు కారణమైంది.