Home Page SliderInternational

ఇంగ్లాండ్-ఇండియా మ్యాచ్‌కు వర్షం గండం

నేడు రాత్రి 8 గంటలకు జరగబోయే ఇంగ్లాండ్-ఇండియా టీ 20 సెమీ ఫైనల్‌కు వర్షం గండం పట్టుకుంది. మ్యాచ్ జరగబోయే గయానా స్టేడియంలో ఆగకుండా వర్షం వస్తోంది. దీనిపై ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఆందోళన క్రికెట్ అభిమానులలో నెలకొంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, రిజర్వు డే కూడా లేదు. అందుకే మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో ఉన్న భారత్ నేరుగా ఫైనల్‌కు ప్రవేశిస్తుంది. దీనితో భారత్ అభిమానులు ఊరట చెందుతున్నారు. కాగా మొదటి సెమీఫైనల్‌లో ఆఫ్గాన్‌పై సౌతాఫ్రికా గెలుపొంది ఫైనల్‌కు చేరింది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే టీమిండియా ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనుంది.