ఇంజనీరింగ్ కళాశాలలు నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలు కాకూడదు..రేవంత్ రెడ్డి
ఇంజనీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ కాలేజీలు నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలు కాకూడదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో నేడు సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలు మేధావులను తయారు చేసే సంస్థలుగా ఉండాలన్నారు. కొన్ని కళాశాలలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోర్సులను కచ్చితంగా నడపాలని, లేదంటే విద్యావ్యవస్థ గాడితప్పుతుందని, దేశం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.