ఇంజిన్‌లో మంటలు.. విమానం లో భయానక నిమిషాలు
అమెరికాలోని లాస్‌వేగాస్‌లో గల హ్యారీ రీడ్ ఎయిర్‌పోర్ట్ నుంచి నార్త్ కరోలినాలోని ఛార్లట్ నగరానికి బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 8:11 గంటలకు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, గగనతలంలో ఒక ఇంజిన్ నుంచి మంటలు, పొగలు రావడం కనిపించడంతో విమానంలో ప్రయాణిస్తున్నవారంతా భయాందోళనకు గురయ్యారు.సమయస్ఫూర్తిగా స్పందించిన పైలట్లు, విమానాన్ని తక్షణమే తిరిగి లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్ట్ వైపు మళ్లించారు. ఉదయం 8:20కి విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడించింది. విమానంలో మొత్తం 153 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేకుండా విమానం భద్రంగా దిగడం ఊపిరి పీల్చేలా చేసింది.ఈ సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీలో, ఇంజిన్‌లో తీపమైన మంటల ఆనవాళ్లు కనిపించలేదని ఎయిర్‌లైన్ మెకానిక్స్ వెల్లడించారు. అయినా గాల్లో ఉన్నపుడే వీడియో తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.