Andhra PradeshHome Page Slider

ముగిసిన నారా లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర పూర్తయ్యింది. జనవరి 27న కుప్పంలో చేపట్టిన యువగళం పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిసెంబర్ 11న ప్రజలతో మమేకమై 3000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసి విశేషమైన మైలురాయిని సాధించారు. పాదయాత్ర ముగిసే సమయానికి లోకేష్ 3,132 కి.మీ యాత్ర పూర్తి చేశారు. పైలాన్ ఆవిష్కరించి లోకేష్ పాదయాత్ర ముగించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ముగింపు వేడుకలో పాల్గొన్నారు. జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభించగా.. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర సాగింది.