home page sliderHome Page SliderNational

బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షార్ప్‌ షూటర్‌ ఎన్‌కౌంటర్‌ లో మృతి

ఉత్తరప్రదేశ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. హాపూర్‌ కొత్వాలి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌ టాస్క్‌ఫోర్స్‌, దిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌ చేపట్టింది. కాల్పుల్లో 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షార్ప్‌ షూటర్‌ నవీన్‌ కుమార్‌ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. నవీన్ కుమార్ ఘజియాబాద్ జిల్లాలోని ప్రాంతానికి చెందినవాడు. లారెన్స్ గ్యాంగ్ లో షార్ప్ షూటర్ గా పేరొందాడు. ఆ గ్యాంగ్ సభ్యుల్లో ఒకడైన హషీం బాబాతో కలిసి పని చేస్తున్నాడు. ఢిల్లీ, యూపీలలో హత్యా, హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీలతో సహా మొత్తం 20 కేసుల్లో నవీన్ కుమార్ నిందితుడు.