ఖాళీగా శ్రీనగర్ విమానం..
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి పర్యటకులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఘటన తర్వాత కేవలం 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్ ను వీడినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి శ్రీనగర్ కు వెళ్లేవారి సంఖ్య పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లే విమానాలు ఖాళీగా దర్శనమిస్తున్నట్లు తాజాగా నెట్టింట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ నెటిజన్లు ఫొటోలు షేర్ చేస్తున్నారు. కొన్ని రోజుల వరకు ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

