వరద బాధితులకు 100 కోట్ల విరాళం ప్రకటించిన ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న సమయంలో.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించారు. వరద బాధితులకు సహాయంగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల జేఏసీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. రూ. 100 కోట్ల విరాళాలు ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి వెల్లడించారు. ఈ నిధులతో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

