బెదిరింపులకు పాల్పడుతున్న ఎలాన్ మస్క్
ట్విటర్ ఛీఫ్ ఎలాన్ మస్క్ ఇటీవల కాలంలో ఏదోరకంగా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కాగా ఆయన తాజాగా చేసిన పనితో మరోసారి వార్తల్లో నిలిచారు. అదేంటంటే ఎలాన్ మస్క్ బెదిరింపులకు పాల్పడినట్లు అమెరికా రేడియో ఆరోపించింది. కాగా ఆయన అమెరికా రేడియో కంపెనీ యొక్క ట్విటర్ ఖాతాను వేరే కంపెనీకి బదిలీ చేస్తానని బెదిరించారని వెల్లడించింది. దీంతో అమెరికా రేడియో కంపెనీ NPR గత నెల నుంచి ట్విటర్లో పోస్ట్ చేయడం ఆపేసినట్లు తెలిపింది. అయితే NPR ఖాతాను ఇతరులకు కేటాయించే విషయమై మస్క్‌ను ఓ ఉద్యోగి ప్రశ్నించారు. కాగా యాక్టివ్‌గా లేని అకౌంట్లను రీసైకిల్ చేయడం తమ పాలసీ అని ఎలాన్ మస్క్ తెలిపారు. కాబట్టి NPR కు ఇదే వర్తిస్తుందని మస్క్ బదులిచ్చినట్లు ఉద్యోగులు స్పష్టం చేశారు. అయితే ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి విచిత్రమైన పనులు చేస్తూ..అందరినీ అయోమయంలో పడేస్తున్నారు. దీంతో ఎలాన్ మస్క్‌కు అసలేమైంది అని అందరూ ఆశ్యర్యపోతున్నారు. ప్రపంచవ్యప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఎలాన్ మస్క్ ఇలా బెదిరింపులకు పాల్పడడం ఏమాత్రం మంచిదికాదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.