ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించాడు
టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై రికార్డు సృష్టించారు. ఎక్స్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లకు చేరింది. దాంతో ఈ మార్కు అందుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ నిలిచారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 131.9 మిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు. 113.2 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఫుట్ బాల్ దిగ్గజం క్రియానో రోనాల్డ్ ఉన్నారు.