ట్విటర్ లోగోను మార్చిన ఎలాన్ మస్క్
ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి రకారకాలుగా దాని ఫీచర్లను మారుస్తూ..ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ట్విటర్‌లో బ్లూ టిక్ కావాలంటే ఇకపై మనీ పే చేయాలనే కొత్త రూల్‌ను మస్క్ ప్రవేశపెట్టారు. తాజాగా ఇప్పుడు ట్విటర్‌లో మరో మార్పు చేశారు ఎలాన్ మస్క్. అదేంటంటే ఇప్పటి వరకు ట్విటర్‌లో కనిపించిన పిట్ట బొమ్మ స్థానంలో కుక్క బొమ్మను ప్రవేశ పెట్టారు. కాగా ఈ రోజు నుంచే ట్విటర్ యూజర్లకు ఈ కుక్క బొమ్మ కన్పిస్తోంది. అయితే ఇలా జరగడానికి కారణం ఎలాన్ మస్కే అని తెలుస్తోంది. అయితే గతంలో ఓ యూజర్ ట్విటర్‌ను కొనాలని , దాని లోగోను బర్డ్ నుంచి కుక్క బొమ్మకు మార్చాలని ఎలాన్ మస్క్‌ను విజ్ఞప్తి చేశారు. దాంతో మస్క్ ట్విటర్‌లో ఈ విధంగా మార్పులు చేపించినట్లు సమాచారం. కాగా ఈ హామీని నెరవేర్చిన అనంతరం ఆయన “ఇచ్చిన హామీ ప్రకారం” అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

