Home Page SliderInternational

ఎలన్ మాస్క్ ఓవరాక్షన్. వాళ్లను ఎందుకు చంపాలనుకోవడం లేదంటూ పోస్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందన్న ఘటనపై కోటీశ్వరుడు, ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ పైశాచికంగా స్పందించాడు. అధ్యక్షుడు జో బిడెన్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఎవరూ హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించాడు. ఫ్లోరిడాలో ఆదివారం ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నాడని, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆర్గనైజేషన్ FBI పేర్కొంది.

US సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో ఒకరు ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సరిహద్దుకు సమీపంలో ఉన్న “గన్‌మ్యాన్‌పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. “AK-47 స్టైల్ రైఫిల్” స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించింది. “వారు డోనాల్డ్ ట్రంప్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు?” అని రాసిన X లో ఒక పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, మస్క్ ఇలా రాసుకొచ్చాడు. “ఎవరూ బిడెన్/కమలాను హత్య చేయడానికి కూడా ప్రయత్నించడం లేదు.” అంటూ రాక్షసానందం పొందాడు. టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ట్రంప్‌కు బహిరంగ మద్దతుదారుగా ఉన్నారు. ఎందుకంటే నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ హారిస్‌తో ట్రంప్ తలపడుతున్నారు. అమెరికాలో ఈసారి డెమొక్రట్ అభ్యర్థి గెలిస్తే మస్క్ బిజినెస్ ప్లాన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తెచ్చి ఎక్స్ ద్వారా (గతంలో ట్విట్టర్) పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మస్క్ భావిస్తున్నాడు.