NationalNews Alert

ఆసుపత్రిలో గజరాజుల హల్‌చల్

వెస్ట్ బెంగాల్‌లోని జల్పాయ్ గురి ఆర్మీ కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఒక విచిత్రం జరిగింది. స్థానికంగా ఉన్న ఈ ఆసుపత్రిలో ఏనుగులు రచ్చరచ్చ చేశాయి. స్వేచ్ఛగా తిరుగుతూ ఆహారం కోసం వెతకడం మొదలుపెట్టాయి. క్యాంటిన్ దగ్గరకు చేరి అద్దాలు పగులకొట్టాయి. చివరకు తొండంతో ఒక గోధుమపిండి ప్యాకెట్‌ను పట్టుకుపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసి నవ్వుకుంటున్నారు.