ట్రాక్టర్ తో పాటు పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి గ్రామంలో ఏనుగులు హల్ చల్ చేశారు. ఒక్కసారిగా ఏనుగుల గుంపు వచ్చి రైతు సూర్యనారాయణ ట్రాక్టర్, కోకో, పంటలను ధ్వంసం చేశాయి. ఇలా ఏనుగుల గుంపు సంచరించడంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. అటవీ శాఖ ఏనుగులను అడవులకు తరలించి పంటల రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.

