చిత్తూరు జిల్లాలో ఏనుగుల భీభత్సం-జనులపై దండయాత్ర
చిత్తూరు జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. జనావాసాలలో ప్రవేశించి మనుష్యుల ప్రాణాలు కూడా హరిస్తున్నాయి. ఘీంకారాలు చేస్తూ ప్రజలను భయందోళనలకు గురిచేస్తున్నాయి. ఐదు రోజుల క్రితం పొలాలలో పని చేసుకుంటున్న ఒక రైతును చంపగా, నిన్న ఒక మహిళను, తాజాగా మరో మనిషిని తొక్కి చంపాయి. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో తిష్టవేసాయి ఈ గజరాజులు. ఎప్పుడు ఏం జరుగుతుందోనంటూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకు చూస్తున్నారు గ్రామస్తులు. ఇవి తమిళనాడు సరిహద్దుల నుండి వచ్చినట్లు అటవీ అధికారులు అంచనాలు వేస్తున్నారు. మల్లనూరు,పైడిపాలం, కూసూరులో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. చిత్తూరు అటవీశాఖ ఆ ఏనుగులను అడవిలోకి పంపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంటలను నాశనం చేస్తూ మనుష్యులపై కూడా దాడులు చేస్తున్న ఈ ఏనుగులను తొందరలో పట్టుకోవాలని కోరుతున్నారు ప్రజలు.

