News

ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీకి మంగళం

అడిగినవాళ్లకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి ప్రజలకు ఊహించని ఝలక్ ఇచ్చారు. ఉచితాలంటూ పెద్ద ఎత్తున ఆప్ పై విమర్శలు వస్తున్న తరుణంలో ఇకపై విద్యుత్ సబ్సిడీ కేవలం ఎవరైతే కావాలంటారో వారికి మాత్రమే ఇస్తామంటూ ప్రకటించారు. విద్యుత్ రాయితీ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని.. అధికారులు మొత్తం పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని కేజ్రీవాల్ తెలిపారు. కొందరు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని కోరుతున్నారని వారందరికీ తక్షణం చార్జీలు వసూలు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఉచిత హామీలతో కేజ్రీవాల్ విజయం సాధించారంటూ ఆయనపై పలు పార్టీలు ఎన్నో విమర్శలు చేస్తూ వచ్చాయ్. అయితే ప్రజల అవసరాలకు అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకుంటున్నామని… ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని కేజ్రీవాల్ చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు.