NationalNews

ఈ నెల 16న బుల్లి ఎలక్ట్రిక్‌ కారు

గతంలో మనం టాటా నానో కారును చూశాం. ఇప్పుడు అలాంటిదే ఈజ్‌-ఈ కారు పరిచయం కానుంది. ఈ నెల 16న మైక్రో ఎలక్ట్రిక్‌ వాహనం రిలీజ్‌ కానుంది. ముంబైకి చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్‌ సంస్థ మైక్రో ఎలక్ట్రిక్‌ వాహనానిన విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి ఈజ్‌-ఈ అని నామకరణం చేశారు. డెయిలీ యూజ్‌ కారుగా దీన్ని అభివర్ణించారు. పీఎంవీ ఎలక్ట్రిక్‌ నుంచి వస్తున్న మొదటి కారు ఇది. దీని ధర 4 నుంచి 5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈజ్‌-ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. 4 గంటల్లో బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. త్వరలోనే ఉత్పత్తి మొదలు పెడతారని పీఎంవీ ఎలక్ట్రిక్‌ తెలిపింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ కారును డెవలప్‌ చేశామని పీఎంవీ ఎలక్ట్రిక్‌ వ్యవస్థాపకుడు కల్పిత్‌ పటేల్‌ తెలిపారు.