పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఎనిమిది వాహనాలు దగ్ధం
హైదరాబాద్ లోని రామంతాపూర్ పరిధి వివేక్ నగర్ లో ఉన్న ఓ ఇంట్లో ఇవాళ తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ పేలి భారీగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటల తాకిడికి పార్కింగ్ లో ఉన్న మరో ఎనిమిది బైక్లు దగ్ధమయ్యాయి. పార్కింగ్ లో మొత్తం రెండు బ్యాటరీ బైక్ లు, ఏడు ఇతర ద్విచక్ర వాహనాలున్నట్లు గుర్తించారు. మంటలను స్థానికులు అదుపు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

