రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం
బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో జనవరి 3న సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా ఇందిరాపార్క్ వద్ద బీసీల సభ, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నామని తెలిపారు. బీసీ సంఘాలతో బంజారాహిల్స్ లోని తన నివాసంలో కవిత సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. బీసీల జనాభా ఎంతో తెలియంది హామీ ఎలా మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన ఇచ్చారు? అని కవిత ప్రశ్నించారు.

