2025లో ఎన్నికలు వస్తాయి.. జగన్ మళ్లీ సీఎం అవుతారు..
తొలి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాసుపల్లి గణేశ్ ఫైర్ అయ్యారు. జగన్ పై బురద జల్లడం మానుకోవాలన్నారు. సీఎం హోదాలో ఏదైనా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జగన్ మీద నింద వేస్తున్నారని మండిపడ్డారు. దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరని హెచ్చరించారు. విజయవాడ వరదలపై సీబీఐ విచారణ జరిపించాలని వాసుపల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లనే వరదలు వచ్చాయన్నారు. 2025 లో మళ్లీ ఎన్నికలు వస్తాయని.. జగన్ ప్రభుత్వమే మళ్లీ వస్తుందని జోస్యం చెప్పారు.