Home Page SliderTelangana

తెలంగాణాలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు: సీఎం కేసీఆర్

ఇవాళ తెలంగాణాలో ప్రజాప్రతినిథులతో BRS పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలలే గడువుందన్నారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ వరకే తమకు ఛాన్స్ ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రజాప్రతినిథులు ఉండాల్సింది ప్రజల్లో కానీ..ఇళ్లల్లో కాదన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీలో ఎవరు వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పనిచేయాలని హితవు పలికారు. అంతేకాకుండా పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానుకోవాలని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిథులకు సూచించారు.