రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఎప్రిల్ నెలాఖరుకు ఖాళీ అయ్యే 56 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ నెలఖారుకు రాజ్యసభలో 56 మంది సభ్యులు రిటైర్ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 8న విడుదల కానున్న నోటిఫికేషన్ విడుదల కానుండగా… ఫిబ్రవరి 15 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.