ఢిల్లీలో ఎన్నికల నగారా
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల నగారా మోగనుంది. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 17. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ వరకు అవకాశం. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుండే ఓటు వేసే సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.

