వరంగల్ వెస్ట్ నుండి ఎన్నికల ప్రచారం మొదలు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బుధవారం వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ నెల 25న తాండూరులో అభ్యర్థి శంకర్ గౌడ్‌కు, 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రధాని పాల్గొనే అన్ని సభల్లో అధికారికంగా పవన్ కూడా ఆయన వెంబడే ఉంటారు. జనసేన తెలంగాణలో 8 స్థానాల్లో పోటీలో నిల్చొంది. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతు ప్రకటించింది. అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారనేది జనసేన, బీజేపీ శ్రేణులు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

