గజ్వేల్ నియోజవర్గంలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం
మండలం: గజ్వేల్, గ్రామం: అహ్మదిపుర్
ఈ ఊరుకు చెందిన.. సిద్దిపేటలో ఆటో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి డబుల్ బెడ్ రూం ఇల్లు అడిగితే ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఈ ప్రభుత్వం దుస్థితి.
ఈటల రాజేందర్ పెద్దగా అవుతాడని, కొడుకు ముఖ్యమంత్రి పోస్టుకి అడ్డు అని కెసిఆర్ నన్ను కటుక్కుమనిపించిండు. కానీ ఏకుని మేకు చేశారు.. హుజురాబాద్ ప్రజలు. మీ కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసేలా సేవ చేస్తా అని మాట ఇస్తున్నా.
# బీసీని సీఎం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
# మూడవ తారీఖు తరువాత క్వింటాల్ బియ్యం 3100 రూపాయలకు కొంటాం.
# 4 సిలిండర్లు ఉచితంగా అందిస్తం.
# ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.
# నిరుద్యోగులకు జాబ్ కాలెండర్ ప్రకటిస్తాం.
# బీజేపీ వస్తే పెన్షన్లు పోవు, ఇద్దరు ముసలివాళ్ళకు రెండు పెన్షన్లు ఇస్తాం.
# దుబ్బాకలో మీటర్లు వచ్చాయా? BRS పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.
# ప్రమాణం చేయిస్తే మనసులో ఈటల రాజేందర్‌కి ఓటు వేస్తా అని చేసుకోండి.
# రైతుల భూములు తీసుకోవడానికి నీ అబ్బ జాగీరా కేసిఆర్.
# గజ్వేల్‌లో జరుగుతున్న అన్యాయం, అరాచకం నేను వచ్చే వరకు బయట ప్రపంచానికి తెలియదు.
# అన్నీ తీసుకుంటాం, తింటాం, తాగుతాం ఓటు మాత్రం నీకే వేస్తాం అని ప్రజలు చెప్తున్నారు.
# భయపడే బిడ్డ కాదు ఈటల, గిరిగీసి కొట్లాడే బిడ్డ.

