గజ్వేల్ నియోజవర్గంలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం
మండలం: గజ్వేల్, గ్రామం: గిరిపల్లి: నరేంద్ర మోడీ మాట ఇస్తే తప్పని వ్యక్తి. మాట ఇస్తే తప్పే వ్యక్తి కేసీఆర్. కెసిఆర్‌కి నరేంద్ర మోడీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ మాటలు చెప్పినట్లు మీకు డబుల్ బెడ్రూంలు వచ్చాయా? మాకు అవకాశం ఇవ్వండి మేము కట్టించి చూపిస్తాము.
ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో అది చెల్లడం లేదు, ఉచిత వైద్యం పేదలకు అందడం లేదు. బీజేపీ వస్తే పేదవాళ్లకు 10 లక్షల రూపాయల వరకు వైద్యం ఉచితంగా అందిస్తామని హామీ ఇస్తున్నాము. ఊర్లలో అసైన్మెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటిని ఏ విధంగా గుంజుకోవాలి. ఏ విధంగా పెద్దలకు కట్టబెట్టాలి అనే పని కేసీఆర్ చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో భూములు తీసుకొని వాటిని ఉపయోగించకపోతే తిరిగి ఆ రైతులకు అందిస్తాము. తల్లిని పిల్లను వేరు చేస్తే ఎలా పాపం తగులుతుందో రైతుని భూమిని వేరు చేస్తే కూడా అలాంటి పాపమే తగులుతుంది.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎకరం కూడా అనవసరంగా తీసుకోము. బీసీలకి రాజ్యాధికారం ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆకలి విలువ తెలిసినవాడు అందరి ఆకలి తీరుస్తాడు. గిరిపల్లిలో చదువుకున్న యువకుల్లారా ఆలోచన చేయండి బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అందిస్తే లాభం జరుగుతుందా? లేదా?

