చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారం
ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ బీజేపీ తరపున ప్రచారానికి తెలుగు నేతలు సిద్ధమయ్యారు. ఏపీ కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను రంగంలో దింపే ప్రయత్నంలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం తర్వాత మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనితో ఏపీలో కూటమి నేతలు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం.. అక్కడ విజయం సాధించడాన్ని బీజేపీ సెంటిమెంట్‌గా భావిస్తోంది. ఇప్పుడదే సెంటిమెంట్‌ను ఢిల్లీలోనూ ప్రయోగించాలనుకుంటోంది. ఫిబ్రవరి 1న ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. అలాగే పవన్ కల్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. బహిరంగ సభలు, రోడ్ షోలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. కూటమి నేతల ప్రచారం మహారాష్ట్రలో విజయవంతం అయినట్టే ఢిల్లీలోనూ కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం ఆలోచన. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించాలని బీజేపీ ఆలోచిస్తోంది.