Home Page SliderInternational

ప్రధాని మోదీకి ఈజిప్టు ‘అత్యున్నత పురస్కారం’

భారత ప్రధాని మోదీకి ఈజిప్టు దేశ పర్యటనలో అత్యున్నత అవార్డు వరించింది. గత తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రధాని మోదీ అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈజిప్టు ప్రభుత్వం నుండి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అనే అవార్డును ఆ దేశ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫత్తెహ్ ఎల్ సిసి ఆదివారం నాడు అందించారు. ప్రధానికి అందిన 13 వ అత్యున్నత పురస్కారంగా దీనిని చెప్పుకోవచ్చు. గత తొమ్మిదేళ్ల కాలంలో లెజియన్ ఆఫ్ మెరిట్ -అమెరికా, కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి, కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగొహు- పాప్యో న్యూగినియా వంటి అనేక దేశాలకు చెందిన అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు మోదీ. అవే కాకుండా అనేక దేశాల ప్రభుత్వాల నుండి, అంతర్జాతీయ సంస్థల నుండి కూడా అత్యున్నత అవార్డులు ఆయనను వరించారు.