ఎడాపెడా.. ఏంచేసినా…అడిగేదెవడ్రా మాఇష్టం
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ వేతనాలు పెంచేసుకున్నారు.కర్ణాటక మంత్రుల జీత భత్యాల (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, భత్యాల (సవరణ) బిల్లు 2025 కు ఆమోదం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. పెరుగుతున్న ఖర్చుల మేరకు ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ముఖ్యమంత్రి జీతం నెలకు రూ. 1,50,000, మంత్రి జీతం నెలకు రూ. 1,25,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరగవచ్చు. పెన్షన్లలో కూడా భారీ పెరుగుదల ఉండే ఛాన్స్ ఉంది. నెలకు రూ. 55,000 నుంచి రూ. 95,000 వరకు పెరగొచ్చు. ప్రయాణ భత్యాలు.. విమాన, రైలు టిక్కెట్లకు గతంలో నెలకు రూ. 2,50,000 నుంచి నెలకు రూ. 3,50,000 పెరగొచ్చు. వైద్య భత్యాలు, టెలిఫోన్ ఛార్జీలు, పోస్టల్ ఛార్జీలు నెలకు రూ.85,000 నుంచి రూ.1,10,000 కు పెరగొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ జీతాలను 67 శాతం పెంచాలనేది కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది.

