శనివారం కవితను విచారించనున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించనుంది. ఈరోజు జరగాల్సిన విచారణను వాయిదా వేయాలన్న అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంగీకరించింది. ముందస్తు కార్యక్రమాలను ఈడీ విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి తెలిపారు. విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ప్రదర్శనలో రేపు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు విపక్ష పార్టీలను కవిత ఆహ్వానించారు. సోమవారం ED అరెస్టు చేసిన “సౌత్ గ్రూప్” కీలక వ్యక్తి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామ్‌చంద్రన్ పిళ్లైతో కలిపి… కవితను విచారించాలని ఈడీ భావిస్తోంది. ఇదే సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ నమోదు చేస్తుంది.

