తెలంగాణా మెడికల్ కాలజీలను వదలని ఈడీ
తెలంగాణాలోని కామినేని,మల్లారెడ్డి, ఎస్వీఎస్,మమత మెడికల్ కాలేజీలతో పాటు దాదాపు 11 మెడికల్ కాలేజీలపై బుధవారం సోదాలు చేసిన ఈడీ రెండవరోజు కూడా 20 బృందాలతో తనిఖీలు కొనసాగిస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి,జడ్జర్ల వంటి చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పీజీ సీట్లు బ్లాక్ చేసి, అధిక ధరలకు అమ్ముకున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నాయి. కొవిడ్ సమయంలో భారీగా నిధులు మళ్లింపులు, అవకతవకలు జరిగాయని సమాచారం. మెడికల్ కాలేజీ ఫీజుల విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణాలోని మెడికల్ కాలేజీలు 12 వేల కోట్ల రూపాయల స్కామ్‌లో ఉన్నాయని భావిస్తున్నారు. దీనితో ఈ దాడులు ముమ్మరం చేస్తున్నారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు.