Telangana

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ ఉచ్చు

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. ఐతే ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు షబ్బీర్ అలీ. ఒకవేళ ఈడీ నోటీసులు జారీ చేస్తే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అక్టోబర్ 10న సుదర్శన్ రెడ్డి, అక్టోబర్ 11న షబ్బీర్ అలీ విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపించింది. వీరితోపాటు రేణుకా చౌదరి, గీతారెడ్డి, మాజీ ఎంపీ అజన్ కుమార్ యాదవ్ కు సైతం ఈడీ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తాము విరాళాల కింద డబ్బులు ఇచ్చామని .. అది కూడా చెక్కుల రూపంలోనే చెల్లించాలమని.. దాంట్లో ఎలాంటి దాపరికం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. టీకాంగ్రెస్ నేతల విచారణ ఢిల్లీ ఈడీ కార్యాలయంలో జరగనుంది. వీరితోపాటుగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ మహిళ నేతకు సైతం ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని ఈడీ సుదీర్ఘంగా విచారించింది.