NewsTelangana

హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థపై ఈడీ ఆకస్మిక దాడులు

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్‌పై ఈడీ సోదాలు చేస్తోంది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్‌లతో పాటు కొత్తగా శంషాబాద్‌లో కూడా ఈ సంస్థకు వెంచర్లు ఉన్నాయి. గతంలో కూడా ఈ ఫీనిక్స్ సంస్థపై ఐటీ సోదాలు జరిగాయి. జూబ్లిహిల్స్‌లోని ఫీనిక్స్ ఆఫీస్‌లో సోదాలు ఈ రోజు ఉదయం నుండి జరుగుతున్నాయి. రెండు బృందాలుగా వచ్చిన ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో ఐటీ అధికారులు పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు. వారి నివేదిక ఆధారంగానే ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. సంస్థ డైరక్టర్ల ఇళ్లలో కూడా దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ చైర్మన్ చుక్కపల్లి సురేష్, ఎండీ గోపీకృష్ణ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి.