Andhra PradeshHome Page Slider

లెక్కలు పక్కాగా లేవు.. బైజూస్ రవీంద్రన్ ఇళ్లలో ఈడీ సోదాలు

విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై బెంగళూరుకు చెందిన ఎడ్-టెక్ సంస్థ బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం రవీంద్రన్, ఆయన కంపెనీ ‘థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’పై కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ బెంగళూరులోని రెండు వ్యాపార సముదాయాల్లోనూ, సీఈవో నివాసంలోనూ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో పలు నేరారోపణ పత్రాలు, డేటాను ఈడీ స్వాధీనం చేసుకొంది. ఈడీ విచారణ తర్వాత బైజూస్ విచారణకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. సోదాలు FEMA నింబంధనల కింద రెగ్యులర్‌గా చేసేవేనని అభిప్రాయపడింది. “అధికారులతో పూర్తిగా పారదర్శకంగా ఉన్నాం, వారు కోరిన మొత్తం సమాచారాన్ని అందించాం. మా కార్యకలాపాల సమగ్రతపై మాకు అత్యంత విశ్వాసం ఉంది. అత్యున్నత ప్రమాణాల మేరకు, నైతికంగా ముందుకు సాగుతున్నాం.” అంటూ బైజూస్ తెలిపింది. ఈడీ దాడులు నేపథ్యంలో కంపెనీ రోజువారీ కార్యక్రమాలు యథావిథిగా సాగుతాయని బైజూస్ వెల్లడించింది.

“2011 నుండి 2023 మధ్య కాలంలో కంపెనీ ₹ 28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందినట్లు FEMA శోధనలు వెల్లడయ్యిందని ఈడీ మీడియా ప్రకటనలో తెలిపింది. ఇదే కాలంలో విదేశీ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వివిధ విదేశీ సంస్థలకు దాదాపు ₹ 9,754 కోట్లను పంపినట్లు కంపెనీ లెక్కలను బట్టి తెలింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగినట్టు ఈడీ పేర్కొంది. మొత్తం వ్యవహారాన్ని విచారించేందుకు రావాలని రవీంద్రన్‌కు అనేకసార్లు నోటీసులు పంపించినప్పటికీ ED ముందు విచారణకు హాజరుకాలేదంది. “2020-21 ఆర్థిక సంవత్సరం నుండి కంపెనీ తన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయలేదని, ఖాతాలను ఆడిట్ చేయలేదని… ఇది తప్పనిసరి చేయాల్సి ఉందని ED తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన డబ్బుతో “ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో కంపెనీ సుమారు ₹ 944 కోట్లను ఖర్చు చేసిందని అధికారులు గుర్తించారు. తెలిపింది. కంపెనీ అందించిన లెక్కల్లో వాస్తవికతను బ్యాంకుల నుండి సమాచారం తీసుకొని విచారిస్తున్నట్టు ఈడీ వివరించింది.