ఏపీలో టీడీపీ నేత ఇంట్లో ఈడీ సోదాలు
ఏపీలో ఈడీ సోదాలు ప్రారంభమయ్యాయి. కాగా మాజీ టీడీపీ ఎంపీ ,ట్రాన్స్‌ట్రాయ్ డైరెక్టర్ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ ఈ ఉదయం నుంచి సోదాలు ప్రారంభించింది. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు నివాసంతోపాటు వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే ట్రాన్స్‌ట్రాయ్ డైరెక్టర్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణాలు ఎగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా జూబ్లిహిల్స్,మణికొండ,పంజాగుట్టలో ఏకకాలంలో 15 ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. అంతేకాకుండా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ సింగపూర్ లిమిటెడ్‌కు నిధులు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో వారి బ్యాంకు ఖాతాలు ,కీలక పత్రాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.