NationalNews

హైదరాబాద్‌ సహా 40 చోట్ల ఈడీ సోదాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హైదరాబాద్‌లో మరోసారి దాడులు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ శుక్రవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌ సహా 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం, బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. గతంలో కోకాపేటలోని రామచంద్ర పిళ్లై నివాసం, నానక్‌రామ్‌ గూడలోని రాబిన్‌ డిస్టలరీస్‌ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. రాబిన్‌ డిస్టలరీస్‌, రాబిన్‌ డిస్ట్రబ్యూషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పేరుతో రామచంద్ర పిళ్లై పలు కంపెనీలు నడుపుతున్నారు. ఆ సంస్థల్లో అభిషేక్‌ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్‌ రావు డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ తాజాగా నిర్వహిస్తున్న సోదాలపై ఎలాంటి అధికారిక సమాచారం తెలపలేదు.