ప్రముఖ మీడియా సంస్థపై ఈడీ దాడులు
దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ అయిన “న్యూస్ క్లిక్” గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటుంది. కాగా ఈ న్యూస్ క్లిక్ సంస్థ అక్రమ నిధులపై 2021లో కేసు నమోదయ్యింది. ఈ మేరకు గతంలో ఈ సంస్థ కార్యాలయంలో ఈడీ దాడులు చేసింది. కాగా అప్పట్లో ఈ సంస్థలో పనిచేసే న్యూస్ ప్రమోటర్లకు అరెస్ట్ నుంచి హైకోర్టు ఉపశమనం కల్పించింది. అయితే ఇవాళ ఈడీ మళ్లీ న్యూస్ క్లిక్ కార్యాలయంలో, ఉద్యోగుల ఇళ్లల్లో కూడా సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఈ సంస్థకు సంబంధించిన పలువురి ఇళ్లపై ఏకకాలంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దాడులు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ,నోయిడా,ఘాజియాబాద్‌లో కూడా ఈడీ భారీ రైడ్ చెేపట్టింది. ఈ మేరకు ఈడీ ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఆధారాలు,ల్యాప్‌టాప్‌లు,మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ న్యూస్ క్లిక్ సంస్థ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సంస్థ చైనాకు అనుకూలంగా స్పాన్సర్డ్ వార్తలను నడుపుతుందని కూడా ఆరోపణలు ఎదుర్కోంటుంది.

