Home Page SliderTelangana

హైదరాబాదులో మరోసారి ఈడీ రైడ్స్..

హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం తెల్లవారుజామునే తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త సురాన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. చైర్మన్ నరేందర్ సురాన, ఎండి దేవేందర్ సురానా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బోయిన్ పల్లిలోని అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎంక్లేవ్ లోని విల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి.