Andhra PradeshNews

ఎంబీఎస్ జ్యువెలర్స్‌లో ఈడీ సోదాలు

విజయవాడ, మనసర్కార్

విజయవాడలోని ప్రముఖ వ్యాపార సంస్థలో ఎంబీఎస్ జ్యూవెలరీస్‌లో ఈడీ ప్రస్తుతం  తనిఖీలు చేస్తోంది.  ఈ సంస్థ యాజమాన్యం భూముల క్రయ విక్రయాల్లో నకిలీ పత్రాలు సృష్టించిందని పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. కొనుగోళ్లలోని అవకతవకలపై ఫిర్యాదులతో రంగంలోకి ఈడీ అధికారులు దిగారు. నిన్నటి నుంచే ఈడీ అధికారులు ఎంబీఎస్ జ్యువెలర్స్‌లో సోదాలు ప్రారంభించారు. కాగా రెండో రోజు కూడా ఎంబీఎస్ జ్యూవెలర్స్‌లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి.  ఈ తనిఖీలలో కీలక డాక్యుమెంట్లు,హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలు నిజమా? కాదా? అన్న దానిపై ఈడీ అధికారులు త్వరలోనే వివరణ ఇవ్వనున్నారు.