వరుసగా ఆరోసారి ఝార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గత కొంతకాలంగా అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ ఇప్పటికే ఆయనకు 5 సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో ఈడీ తాజాగా మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంపై రేపు విచారణకు రావాలని సూచించింది. కాగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాని ఆయన ఈడీ చర్యల నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాతోపాటు మరో ఇద్దరిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో సీఎం హేమంత్ సోరెన్ రేపు ఈడీ విచారణకు హాజరువుతారో లేదో వేచి చూడాల్సివుంది.