బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి ఈడీ నోటీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. భూదాన్ భూముల స్కామ్ లో మర్రితో పాటు వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై విచారణకు డిసెంబర్ 16న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్ లో సూర్యతేజ, సిద్ధారెడ్డి లాభపడినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అమోయ్ కుమార్ ను పలుమార్లు విచారించిన ఈడి తాజాగా మరో ఇద్దరికి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Breaking news: జర్నలిస్ట్ కు సారీ చెప్పిన సినీ నటుడు