ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ.. చట్టాన్ని గౌరవిస్తా..
డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ ఆఫీస్‌కు వచ్చిన రోహిత్‌రెడి అసలు తనన ఏ కేసులో రమ్మన్నారో తెలియదన్నారు. అయినప్పటికీ ఈడీ విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవిస్తానని ఈడీ నోటీసులకు సమయం కావాలని కోరితే ఇవ్వలేదన్నారు. తన లేఖను తిరస్కరించారని తెలిపారు. తన వద్ద పూర్తి వివరాలు లేవన్న రోహిత్ రెడ్డి… అందుకే సమయం అడిగినట్లు పేర్కొన్నారు. అంతకుముందు రోహిత్ రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఈడీ విచారణకు రాలేనంటూ రోహిత్ రెడి ఈడీకి లేఖ పంపారు. ఈనెల 25 వరకు విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆయన లేఖను ఈడీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించడంతో రోహిత్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.

