సీఎంపై ఈడీ మరో కేసు
కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ లో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దరామయ్యతో పాటు ఆయన కొడుకు యతీంద్రపై కూడా కేసు ఫైల్ చేసింది. 14 స్థలాలకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేయడంలో వీరిద్దరి ప్రమేయం ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. మరో వైపు ముడా స్కామ్ లో ప్రధాన ఫిర్యాదుదారు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈడీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. స్నేహమయిని ఈడీ బెంగళూరు జోనల్ ఆఫీసుకు పిలిపించి విచారించింది. ఈడీ కోరిన పత్రాలను తాను పంపిస్తానని చెప్పినట్టు తెలిపారు.